పాడేరు, జిల్లావాణి ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండల ప్రధాన కేంద్రంలోని బాలురు-1 పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలుగ విధులు నిర్వహిస్తున్న మఠం బాలాకుమారి అనే మహిళా ఉద్యోగిని ఆమె స్వగ్రామమైన రేవళ్ళులో తుదిశ్వాస విడిచారు. ఈమె గత కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ ఇంటి వద్ద మరణించినట్లుగా తన సహచర ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈమె మరణవార్త తెలియడంతో ఉపాధ్యాయులు బంధువులు శ్రేయోభిలాషూలు కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పుడూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మఠం బాలాకుమారి ఇక లేరు అన్న విషయాన్ని ఆత్మీయులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలోనీ మరియు పరిసర ప్రాంతాల్లో ఆమె సేవలను నెమరువేసుకుంటూ ఆమెకు కడసారిగా ఘన నివాళులు అర్పించారు.
మఠం బాలాకుమారి ఆకాల మరణంతో మండలంలో విషాదఛాయలు
RELATED ARTICLES
