నక్కపల్లి, జిల్లావాణి
సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోస్ట్ గార్డ్ సిబ్బంది రోహిత్, కిషోర్ సూచించారు. ఈ మేరకు సోమవారం మండలం లోని రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్య కారులుకు తగిన ప్రోత్సాహం అందిస్తూ అండగా ఉంటుందని మత్స్య కారుల జీవనోపాదికి సంబందించి ముఖ్య మంత్రి చంద్రబాబు ముందు చూపుతో అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారని ప్రతి ఒక్క మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం లో మత్స్య కారులుకు అండగా ఉంటూ ప్రతి సమస్య పరిష్కారం చేస్తున్నారని అన్నారు.మత్స్య కారులు వేట సమయంలో అప్రమత్తం గా ఉంటూ గుర్తింపు కార్డులు లైఫ్ జాకెట్ తదితర వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు.అలాగే ప్రమాద సమయంలో 1554 టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజయ్యపేట తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిక్కి గంగరాజు, ఐ టి డి పి జిల్లా కమిటీ సభ్యులు,మడదా రాంబాబు,యజ్జల లోవరాజు,మత్స్యకార సిబ్బంది నాగమణి, రజిని,మత్స్యకారులు మైలపల్లి రాము, పిక్కి నూకరాజు, గోసల స్వామి, బొంది జగ్గ, రాజారావు, తదితర మత్స్యకారులు పాల్గొన్నారు.
