జగ్గంపేట, మార్చి: 12(జిల్లా వాణి ప్రతినిధి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత పదవుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన గుల్లా ఏడుకొండలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.తాడేపల్లిలోని పార్టీ ముఖ్య కార్యాలయం నుండి ఈ ప్రకటన వెలువడింది. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ తోట నరసింహం సిఫార్సు మేరకు ఏడుకొండలకు ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.అధినేతకు, తోట కుటుంబానికి కృతజ్ఞతలు తన నియామకం పట్ల గుల్లా ఏడుకొండల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారికి, యువజన విభాగం నాయకులు తోట రాంజీ గారికి ఆయన తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏడుకొండల నియామకం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

