నక్కపల్లి, జిల్లావాణి
జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు పాయకరావుపేట నియోజకవర్గం లో ఈనెల 14న జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసైనికులు సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివ దత్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో14న శనివారం మధ్యాహ్నం 3గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని అనంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే 5గంటలకు ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డు శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు భారీ ఎత్తున నక్కపల్లి నుండి అడ్డురోడ్డు వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తో బైకు ర్యాలీ జరుగుతుందని తెలిపారు.అడ్డురోడ్డు లో ఏర్పాటు చేయబోయే సభా ప్రాంగణం వరకు జరిగే బైకు ర్యాలీ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని,పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొనాలని కోరారు.
రేపు ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES
