Thursday, April 16, 2026
HomeUncategorizedపురపాలక సంఘంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లో భాగంగా మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో స్కూల్...

పురపాలక సంఘంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లో భాగంగా మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు ” ఘన *వ్యర్ధాల నిర్వహణ ” అనే అంశంపై అవగాహన కల్పించుటకు స్థానిక కొత్తపేట జడ్పీహెచ్ స్కూల్ లో కార్యక్రమం నిర్వహించారు

. దీనిలో భాగంగా ఘన వ్యర్ధాల రకాలు ( తడి, పొడి, హానికర వ్యర్ధాలు) వాటిని ఇంటి వద్ద వేరు చేయు విధానం , వాటి యొక్క నిర్వహణ, ఇంటి వద్దనే హోం కంపోస్ట్ చేయు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాక ” నారీ లీడ్స్ స్వచ్ఛత ” అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ BJS ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులను సమావేశపరచి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల సమక్షంలో వారికి ఆటలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా పారిశుద్ధ కార్మికులు వారి యొక్క అనుభవాలను వివరించి ప్రజలను ఇంటి వద్ద పొడి చెత్త ను వేరు చేసి ఇవ్వాల్సిందిగా , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, శానిటరీ సెక్రెటరీ లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు .
కమిషనర్ ఎలమంచిలి పురపాలక సంఘం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular