Thursday, April 16, 2026
HomeUncategorizedహోంమంత్రి విశేష కృషితో గ్రామాలలో అభివృద్ధి పరుగులు

హోంమంత్రి విశేష కృషితో గ్రామాలలో అభివృద్ధి పరుగులు

నక్కపల్లి, జిల్లావాణి మండలం లోని ఉపమాక శివారు సారిపల్లిపాలెం గ్రామంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు మేరకు 6 రోడ్లుకు గాను 25లక్షలు మంజూరు చేయగా నక్కపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు కొప్పిశెట్టి బుజ్జి శనివారం పనులు ప్రారంభించారు.ఈ సందర్బంగా బుజ్జి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఉపమాక గ్రామ పంచాయతీ కి సిసి రోడ్లు నిమిత్తం కోటి పది లక్షల రూపాయలు, అలాగే త్రాగు నీటి కొరకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది,నియోజకవర్గం లో ఇంతటి భారీ ఎత్తున అభివృద్ధి పనులు గతంలో టిడిపి ప్రభుత్వం లోనే జరిగింది. గత వైసిపి ప్రభుత్వం లో కనీసం ఒక్క పని కూడా జరగకపోగా అభివృద్ధి కి ఆటంకం కలిగింది. ఎక్కడ ఒక్కపని కూడా గ్రామస్థాయిలో జరగలేదు.మరల కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం హోం మంత్రి అనిత నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేయడం తో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు, నాయకులు హోం మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రగడ వీరబాబు గ్రామ టిడిపి అధ్యక్షులు కొప్పిశెట్టి శ్రీను, టిడిపి నాయకులు ఎలమంచిలి రమణబాబు, ఎలమంచిలి జోగారావు, ఎలమంచిలి శ్రీను, శీరం నూకరాజు, చొప్ప నరసింహమూర్తి, నాగబాబు తోలేటి శ్రీను, కొప్పిశెట్టి వాసు, వెంకటప్పారావు జనసేన నాయకులు ఎలమంచిలి చంద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular