Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఘనంగా ఆత్కూరి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు

ఘనంగా ఆత్కూరి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి:భారతదేశంలో రామాయణం, కవితలు, రచనలు రాసిన వారికి భారతదేశంలోని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జయంతిలు అధికార పూర్వకంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో ఆత్కూరి మొల్లమాంబ 586వ జయంతిని పురస్కరించుకొని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్,ఏపీవో జనరల్ డిఎన్వి రమణ, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ.శ్రీనివాసరావు వారితోపాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సిబ్బంది ఆత్కూరి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ మాట్లాడుతూ ఆత్కూరి మొల్లమాంబ తండ్రి కేసన్న 1440 సంవత్సరములు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో గోపవరం గ్రామంలో జన్మించారని అదేవిధంగా 1530 సంవత్సరములో చనిపోవడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆత్కూరి మొల్లమాంబ వారు సుమారు 90 సంవత్సరాల పాటు జీవించడం జరిగిందని ఆయన అన్నారు. ఆత్కూరి మొల్లమాంబ మొల్ల రామాయణం తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో మొల్ల రామాయణం రాయడం జరిగిందని అదేవిధంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో రచనలు, కవితలు కూడా రాసేవారిని ఆయన తెలిపారు. మన భారతదేశం కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన వారికి అదేవిధంగా రామాయణాలు, రచనలు, కవితలు వ్రాసిన వారికి మన భారత దేశ ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అధికార పూర్వకంగా జయంతిని జరుపుకోవడం చాలా గొప్ప విశేషమని ఆయన అన్నారు. మన దేశం కోసం ప్రాణాలర్పించిన అదేవిధంగా రామాయణాలు రచించిన వారికి ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఓ దేవదానం, ఐటిడి పరిపాలన అధికారి ఎర్రం శెట్టి రాజు, ఎస్ఓ టి.మార్తమ్మ, డాక్టర్ శ్వేత, ఐటీడీఏ మేనేజర్ బి. రాజు,సీనియర్ సంపాదకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చక్రధర్, ప్రభాకర్ రావు, పల్లాల భీమిరెడ్డి, నాగభూషణం, నాగేంద్ర, పోతురాజు, జ్యోతి రాజు, ఆర్టికల్చర్ సభా స్టెంట్లు నాగరాజు, నూకరాజు, అప్పలస్వామి, శోభన్ బాబు, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular