Thursday, April 16, 2026
HomeUncategorizedప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి ప్రజా దర్పారు ఎమ్మెల్యే బండారు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి ప్రజా దర్పారు ఎమ్మెల్యే బండారు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రజాదర్బార్…

చింతలూరులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. చింతలూరు నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఆయన శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజల నుంచి వినతులు, అభ్యర్థనలు స్వీకరించారు. మొత్తం 32 వినతులు అందగా అందులో పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల నుంచి అందిన ప్రతీ వినతి పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular