నక్కపల్లి, జిల్లావాణి
మత్స్య కారులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు శనివారం మండలం లోని రాజయ్యపేట గ్రామం లో సచివాలయం వద్ద టీడీపీ మండల అధ్యక్షులు గింజల లక్ష్మణరావు, రాజయ్యపేట కూటమి నాయకులు తదితరులు సమక్షంలో మత్స్యకార సోదరులకు మూడు బోట్ ఇంజిన్లు పంపిణీ వెంకటేష్ ఆధ్వర్యంలో పంపిణి చేశారు.ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గానికి ఆడపడుచు, ప్రతి ఒక్కరు బాగుండాలని తపన పడే నాయకురాలు అనితమ్మ పాయకరావుపేట నియోజకవర్గం చరిత్ర లో మొట్ట మొదటి సారిగా మంత్రి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అహర్నిశలు అభివృద్ధికై కృషి చేస్తున్నారని తెలిపారు.అలాగే మత్స్య కారులకు అండగా ఉంటూ వారి జీవనోపాదికి అవసరమగు అనేక సామాగ్రి సమాకూర్చుతూ భరోసా కల్పిస్తున్నారన్నారు.ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వానికి,అనితమ్మకు నియోజకవర్గం మత్స్య కారులు తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు పిక్కి గంగరాజు, సొసైటీ అధ్యక్షులు పిక్కి కోదండరావు, పిక్కి దేముడు పూజారి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొంది గుర్రన్న, పిక్కి కిరణ్, పిక్కి గోపి,పూజారి తాతీలు, సత్యారావు, అప్పన్న, చేపల రామకృష్ణ, పాల్గొన్నారు.
మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం
RELATED ARTICLES
