-ఉపాధ్యాయ ఎమ్మెల్సి గాదె శ్రీనువాసులు నాయుడు –
నక్కపల్లి, జిల్లావాణి
పదవతరగతి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు వ్రాసి విజయం పొందాలని ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు డాక్టర్ గాదె శ్రీనువాసులు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను శనివారం సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను అవ్వకుండా పాఠశాల లో ఉపాధ్యాయులు సూచనలు పాటిస్తూ పదవతరగతి పరీక్షలు ల్లో విజయం పొందాలని అలాగే భవిష్యత్తు లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు.అలాగే ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర బృతిని ప్రకటించాలని,త్వరలో పిఆర్సి అమలు చేసి సర్వీస్ రూల్స్ అమలు కు కృషి చేయాలని పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు డి.గోపీనాథ్, పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు టి.వి రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు ఎ. సత్య వతి, శేష గిరి, గుణవతి తదితరులు పాల్గొన్నారు.
పదిలో విద్యార్థులు శత శాతం విజయం సాదించాలి
RELATED ARTICLES
