పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి అన్నారు. శుక్రవారం ఉదయం రంపచోడవరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీష దేవి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ దరఖాస్తు దారులు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తో పాటూ దరఖాస్తులు అందించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తు పరిష్కారం చేస్తానని హమీ ఇచ్చారు.ఈ క్రమంలో వై .రామవరం తహసిల్దార్ కార్యాలయంలో ఇటీవలే సచివాలయ ఉద్యోగిని ప్రమాద ఘటనపై సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యేనీ కలిసి న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఆమె రంపచోడవరం ఐటిడిఎ పీవో స్మారన్ రాజ్ తో చరవాణిలో మాట్లాడి పరిష్కారం కొరకు మాట్లాడారు. ఇదే క్రమంలో రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన గిరిజనులకు ప్రత్యామ్నాయం ఇస్తామని చెప్పినప్పటికీ నేటికీ ఎటువంటి ఇవ్వలేదని సంబంధిత బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా వీటిని త్వరలోనే పరిష్కారీస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. ఇదే కోణంలో మరికొన్ని మౌలిక వసతుల కల్పన కోసం దరఖాస్తులు రాగా వెంటనే స్పందించిన ఆమె ఆయా శాఖల అధికారులకు చరవాణిలో మాట్లాడి పరిష్కారం చేయాలని వారిని ఆదేశించారు. రంపచోడవరం మండలంలో త్రాగునీటి సమస్య కోసం ఆమె దృష్టిలో పెట్టగా ఎంపిడిఓ తో మాట్లాడి వెంటనే పరిష్కారం చేయాలన్నారు. పిడతమామిడి గ్రామంలో సెల్ టవర్ లేకపోవటంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపి టవర్ నిర్మాణం కోసం విన్నవించగా పరిష్కారం చేస్తానని హమీ ఇస్తూ సంబంధిత అధికారులకు టవర్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభానీ, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్ ఏఎంసీ వైస్ చైర్మన్ సలాది బాపిరాజు, సీతపల్లి గుడి చైర్మన్ కుంజం బాపన్నదొర, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, కోసు నాగన్న దొర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి, మారేడుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేషుకుమార్, జనసేన నాయకులు పాపోలు శ్రీనివాసరావు, గంగవరం మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకట రెడ్డి, దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల చంటిబాబు, మాజీ సర్పంచ్ నిరంజనీ దేవి,సీతపల్లి గుడి దేవస్తానం సభ్యులు సిద్ధ వెంకన్న దొర, రంపచోడవరం ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు షేక్ చోటు, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావు, దేవీపట్నం సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు, జనసేన మారేడుమిల్లి అధ్యక్షులు మల్ల దుర్గ ప్రసాద్, గంగవరం మాజీ ఎంపీపీ తీగల ప్రభ, పతివాడ రమణ, కోసు రామన్న దొర, పరదా సత్యవేణి, బీజేపీ సత్యనారాయణమ్మ, రంపచోడవరం ఎంపిడిఓ ప్రసాద్, రెవిన్యూ ఆర్ఐ నిర్మల కుమారి పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి
RELATED ARTICLES
