Thursday, April 16, 2026
HomeUncategorizedపిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల రైతులు హర్షం

పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల రైతులు హర్షం

నక్కపల్లి, జిల్లావాణి
ఉగాది పర్వదినం సందర్బంగా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం హర్షనీయమని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు అన్నారు. ఈ మేరకు మండలం లోని జానకయ్య పేటలో శుక్రవారం పలువురు రైతులుతో అగ్రికల్చర్ అధికారి కొండలరావు,గ్రామస్తులు కలిసి ఒక వేదికగా చేరి ముఖ్యమంత్రి రైతులకు నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని టీవీ ల ద్వారా వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా అప్పలరాజు మాట్లాడుతూ సుమారుగా 46.85లక్షల మంది అన్నదాతల అకౌంట్ లో పి.ఎం కిసాన్ నిధులు 2వేలు, అన్నదాత సుఖీభవ 4వేలు తో మొత్తం 6వేల రూపాయలు ప్రభుత్వం జమచేయడం జరిగిందని ఇచ్చిన మాట నిలుపుకునే ప్రభుత్వం కూటమి అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్న రైతు కళ్ళలో సంతోషం ముఖ్యం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం తో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అణునిత్యం శ్రమిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో కురందాసు సింహా చలం, కురందాసు అప్పలరాజు, దేవర సత్తిబాబు, దేవర రామక్రిష్ణ, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular