Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరైతుల సమక్షమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే : శిరీష దేవి

రైతుల సమక్షమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే : శిరీష దేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు సద్వినియోగపరచు కొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో పి ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మూడో విడత చెక్కు పంపిణీ కార్యక్రమాని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.బొజ్జిరెడ్డి,రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, రాష్ట్ర ఎస్టి కమిషన్ నెంబర్ గొర్లె సునీత ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు మూడో విడతలో 6 వేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రైతులు పండించిన ఉత్పత్తులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. జీడిపిక్కలు, పసుపు, జాఫ్రా, కొండచిపుర్లు తదితరు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం కృషి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు సేవా కేంద్రాలలో అమ్మే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్మిన రైతులకు 24 గంటల్లో ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని ఆమె అన్నారు. 10 లక్షల రూపాయల వ్యయంతో మహిళ రైతులకు డోన్లు దరఖాస్తు చేసుకున్న వారికి అందజేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ ప్రాంత గిరిజన రైతులకు సబ్సిడీపై టాక్టర్లు, బొలెరో వాహనాలు అందజేయడం జరిగిందని ఆమె అన్నారు. మహిళా సంఘాలకు సబ్సిడీపై పాడి గేదెల అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిషన్ పథకం ద్వారా గత రెండు విడతలలో 14 వేల రూపాయలు రైతుల ఖాతాలను జమ చేయడం జరిగిందని ఈ క్రమంలోనే మూడో విడతగా ఒక్కొక్క రైతుకి 6000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని శిరీష అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని రైతుల సమక్షమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయడం జరిగిందని ఆమె అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జి రెడ్డి మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందిన విధంగా 2019 సంవత్సరంలో పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఎప్పటికప్పుడు ప్రోత్సాహాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే పకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల ఆహారాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో 123 ఆర్.ఎస్.కె కేంద్రాలు కలవని ఆయన అన్నారు. రైతులకు డ్రిప్పు ఏర్పాటు చేయుటకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి రైతుకు పకృతి వ్యవసాయంపై అవగాహన కలిగించాలని ఆయన అన్నారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీ పై రైతులకు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఆయిల్ ఫామ్ తోటలు వేయుటకు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత లో
రంపచోడవరం మండలంలో 5913 మంది రైతులకు 3.55 కోట్ల రూపాయలు, దేవీపట్నం మండలంలో 2729 మంది రైతులకు ఒక కోటి 64లక్షల రూపాయలు, మారేడుమిల్లి మండలంలో 3496 మంది రైతులకు 2 కోట్ల 10 లక్షల రూపాయలు, అడ్డతీగల మండలంలో 5381మంది రైతులకు 3 కోట్ల 23 లక్షల రూపాయలు, గంగవరం మండలంలో 4161 మంది రైతులకు 2 కోట్ల 60 లక్షల లక్షల రూపాయలు, రాజవొమ్మంగి 5490 మంది రైతులకు 3 కోట్ల 29లక్షల రూపాయలు, వై. రామవరం మండలంలో 3383 మంది రైతులకు 3 కోట్ల 11 లక్షల రూపాయలు, చింతూరు మండలంలో 2807 మంది రైతులకు 1 కోటి 68లక్షల రూపాయలు, కూనవరం మండలంలో 1501 మంది రైతులకు 90 లక్షల రూపాయలు, విఆర్ పురం మండలంలో 652 మంది రైతులకు 49లక్షల రూపాయలు, నెల్లిపాక మండలంలో 3022 మంది రైతులకు 1కోట్ల 84 లక్షల రూపాయలు రూపాయలు, గుర్తేడు మండలంలో 1823 రైతులకు 1 కోటి 12 లక్షల రూపాయలు అదేవిధంగా పోలవరం జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో 40358 మంది గిరిజన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 16.14 కోట్ల రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 8.42 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 24 కోట్ల 56 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వ నిబంధన ప్రకారం జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా 24 కోట్ల 56 లక్షల రూపాయల చెక్కును రైతులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా లైవ్లో ప్రధానమంత్రివర్యులు నరేంద్ర మోడీ ప్రసంగం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రసంగం ద్వారా రైతులకు వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ నెంబర్ గొర్లె.సునీత, ఏపీవో జనరల్ డిఎన్వి రమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ మోహన్ రావు,వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శశి బిందు, ఐటీడీఏ పరిపాలన అధికారి ఎర్రంశెట్టి రాజు, జిల్లా ఆర్టికల్చర్ అధికారి దేవాదనం,మండల వ్యవసాయశాఖ అధికారులు కె. లక్ష్మణరావు, సిహెచ్ శివ శ్రీనివాస్, ఎం.సుజాత, కె.విశ్వనాథం, వెంకటేశ్వరరావు, సత్య దేవి, రత్న ప్రభ, రమేష్, దేవి, దుర్గ రమేష్, ఉమ్మడి ప్రభుత్వ నాయకులు స్వప్న కుమారి, అడబాల బాపిరాజు, ఐటీడీఏ మేనేజర్ బి.రాజు మాజీ ఎంపీపీ తీగల ప్రభ, వై రామవరం మండల తాసిల్దార్ వేణుగోపాల్, గంగవరం ఎంపీడీవో లక్ష్మణ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular