Thursday, April 16, 2026
HomeUncategorizedపదవతరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు బహుమతులు

పదవతరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు బహుమతులు

నక్కపల్లి, జిల్లావాణి
పదవతరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించిన వారికీ తగిన ప్రోత్సాహం అందించి నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని రాజయ్యపేట టిడిపి గ్రామశాఖ అధ్యక్షులు పిక్కి గంగరాజు అన్నారు. ఈ మేరకు శనివారం గ్రామం లోని జిల్లాపరిషత్ పాఠశాల లో విద్యార్థులకు హల్ టికెట్ లు అందజేశారు. ఈ సందర్బంగా గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆశయ సాధన కోసం పదో తరగతి విద్యార్థులు 100% శాతం మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని గురువులకు తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.అలాగే
100% శాతం మార్కులతో పరీక్షలు ల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధమ బహుమతిగా 5000 రూపాయలు,ద్వితీయ బహుమతి గా 3000 రూపాయలు, తృతీయ బహుమతి గా 2000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.విద్యార్థులు అందరికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,టీడీపీ నాయకులు,జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొంది గుర్రన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular