Thursday, April 16, 2026
HomeAndhra Pradeshకొనసాగుతున్న మెడికల్ క్యాంపులు, ఆగని మృత్యు ఘంటికలు

కొనసాగుతున్న మెడికల్ క్యాంపులు, ఆగని మృత్యు ఘంటికలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలంలోని మారేడుబాక గ్రామ పంచాయతీ ఉర్లాకులపాడు గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలో గత కొంత కాలంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూన్నప్పటికీ ఆ గ్రామంలో మృత్యువాత పడుతున్న వారిని ఏమాత్రం కాపాడుకోలేకపోతున్నారు. వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో గిరిజనులు పిట్టలా రాలిపోతున్నారు. ఉర్లాకులపాడు గ్రామం పేరు చెప్తేనే మండలం లోని ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అదే గ్రామానికి చెందిన కోసూరి తమ్మారావు(43) అనే గిరిజనుడు వ్యక్తి కిడ్నీ వ్యాధితో కాకినాడ జనరల్ ఆస్పత్రిలో గత 14 రోజులగా డయాలసిస్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఉర్లాకులపాడు గ్రామంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వ్యక్తీకి భార్య భద్ర , సింధు అనుష రెడ్డి జ్యోతిక రెడ్డి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular