నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని వెదుళ్ల పాలెం లో పిసిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఉపాధి పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం పర్యటించారు. ఈ పర్యటన లో షర్మిల ఉపాధి హామీ శ్రామికురాలిగా మారింది.తమ గ్రామాలు న్యాయంపూడి, వెదుళ్ల పాలెం మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదని గ్రామస్తులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు పాఠశాల కు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో స్పందించిన షర్మిలవెంటనే రచ్చబండ వేదికగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరం అన్నారు.మన్రేగా పథకాన్ని మోదీ బ్రస్టు పట్టించారన్నారు.చేసిన పనికి కూడా నగదు జమ చేయకుండా శ్రమ దోపిడీ చేశారని తెలిపారు.
కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి పనికి ఇబ్బందులు తెచ్చారన్నారు.
ఇప్పుడు ఏకంగా మన్రేగా చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు.వీబీ జి – రామ్ జి అని పనికి రాని చట్టం తెచ్చారని ఎద్దేవా చేశారు.ఇప్పటికే రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్నారు.జగన్ , చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని పేర్కొన్నారు.
కొత్త చట్టంతో రాష్ట్రం మీద 5 వేల కోట్ల భారం పడుతుందన్నారు.
125 రోజులు పని కల్పన అనేది పచ్చి మోసం,దగా అన్నారు.గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారని తెలిపారు.ఉపాధి పనిపై బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే కార్డులు ఎందుకు తొలగిస్తారు అని ప్రశ్నించారు.
మోదీ చట్టం గ్రామ స్వరాజ్యం వినాశనం అని ఎద్దేవాచేశారు.
మన్రేగా చట్టం తోనే ఉపాధికి ఊపిరి అని పేర్కొన్నారు.కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నక్కపల్లి మండలంలో ఎపిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల పర్యటన
RELATED ARTICLES
