నక్కపల్లి,జిల్లావాణి,
రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన కాసులమ్మ భర్త మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భాoతి
వ్యక్తం చేశారు. నక్కపల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యురాలిలా ఉంటూ సేవలందిస్తున్న కాసులమ్మ కుటుంబానికి ఈ ఘటన తీరని లోటు అని ఆమె పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాసులమ్మ భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవకపోవడం చాలా బాధాకరమని మంత్రి అనిత అన్నారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి అనిత సారిపల్లిపాలెంలో
కాసులమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కాసులమ్మ కుటుంబానికి అండగా ఉంటా :హోం మంత్రి అనిత
RELATED ARTICLES
