Thursday, April 16, 2026
HomeAndhra Pradeshజాతర మహోత్సవం "గోడపత్రిక" ఆవిష్కరించిన: రంప శాసనసభ్యురాలు

జాతర మహోత్సవం “గోడపత్రిక” ఆవిష్కరించిన: రంప శాసనసభ్యురాలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఏజెన్సీ ముఖ ద్వారమైన దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో సుప్రసిద్ధ ప్రసిద్ధిగాంచిన శ్రీ గండి పోశమ్మ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం గోడపత్రికను ఆదివారం రంప శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి గండి పోశమ్మ దేవస్థానం చైర్మన్ మలుగుల శ్రీనివాస రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వద్ద జాతర మహోత్సవ గోడపత్రికను ఆమె చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ గండి పోశమ్మ దేవస్థానం దేశంలోనే చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయమన్నారు. పోలవరం ప్రాజెక్టులో గండి పోశమ్మ దేవస్థానం మునిగిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అత్యంత ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి నష్టం లేకుండా ఒక ఆదర్శ దేవాలయంగా నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాతర మహోత్సవాలు మార్చి నెల 20 నుండి 24 వ తేదీ వరకూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో సంప్రదాయ బద్దంగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రజలందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో గండి పోశమ్మ దేవస్థానం ప్రతినిధులు గండి లక్ష్మి కుమార్ ఆలయ ఈవో మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరి శెట్ల వెంకటేశ్వరావు కోండ్ల శివ రెడ్డి పాముగండి సర్పంచ్ లంక పోసిబాబు శివ శంకర్ కొండబాబు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular