Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

రంపచోడవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని చెరువుకొమ్ముపాలెం జడ్డంగి 516 ఈ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ద్విచక్ర వాహనానికి గేదె అడ్డురావడంతో తండ్రి కూతురు ప్రమాదానికి గురైయ్యారు. వివరాల్లోకి వెళితే మండలంలోని లాగరాయి గ్రామానికి చెందిన తంగేటి శ్రీను(48) కుమార్తె దేవిప్రియాంక (23) రంపచోడవరంలోని శనివారం జరిగిన బిఈడి పరీక్షలను రాసి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాద బారినపడ్డారు. అదే సమయంలో జడ్డంగి నుండి అడ్డతీగల వైపు వెళుతున్న సర్పంచులు కె. మురళీకృష్ణ, డి. నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాదర్, ఎన్. ప్రసాద్ లు రేవటిపాలెంకు చెందిన అనిత ఈశ్వలత ప్రమాదానికి గురైన తండ్రి కూతురునీ ఓ ప్రవేటు వాహనం అంబులెన్సులో జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్య అధికారి డా. నాగార్జున, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి ప్రాథమిక చికిత్స చేసారు. ఈ ప్రమాదంలో తండ్రి శ్రీనుకు ఎడమ చేయి విరిగిపోగా, కూతురు దేవి ప్రియకు మోకాలు వద్ద గాయాలు అయ్యాయని డాక్టర్ నాగార్జున తెలిపారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం 108లో రాజమండ్రి రిఫర్ చేశారు. ప్రమాదానికి గురైన విషయంలో తెలుసుకున్న రాజవొమ్మంగి మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు లాగరాయి సర్పంచ్ గణిలక్ష్మి మణికంఠ వీరబాబు పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular