Friday, June 5, 2026
HomeUncategorizedగొల్లలగుంటలో ఉత్సాహంగా ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో జ్యోతుల నవీన్

గొల్లలగుంటలో ఉత్సాహంగా ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో జ్యోతుల నవీన్

జగ్గంపేట, మార్చి 16 (జిల్లా వాణి ప్రతినిధి):వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ, ప్రతి రైతు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. సోమవారం జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఆయన గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కీలక అంశాలు:పథకాల అమలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘పంచ సూత్రాల’ ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. అన్నదాత సుఖీభవ కింద 4000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2000 రూపాయలు కలిపి మొత్తం 6000 రూపాయల నగదు రైతులకు అందుతోందని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధులు మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయా లేదా అని స్వయంగా ఆరా తీశారు. “ప్రస్తుతం పంట కోతల సమయం కావడంతో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం పెట్టుబడి పనులకు ఎంతో ఆసరాగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.”పాల్గొన్న అధికారులు మరియు నాయకులు:ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ గరిమెళ్ల శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఎస్. నరసింహం, ఉద్యాన అధికారిణి శ్రీవల్లిలతో పాటు స్థానిక నాయకులు జీను మణిబాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, మండపాక అప్పన్న దొర, చింతాకుల ఈశ్వరరావు, రాయుడు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular