Thursday, April 16, 2026
HomeUncategorized​గండేపల్లిలో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

​గండేపల్లిలో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

​గండేపల్లి, మార్చి 16 (జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా గండేపల్లి మండల జెడ్.రాగంపేట విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు.​స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లి మండలం జెడ్. రాగంపేట గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మీకుమారి అనే మహిళ స్థానిక ఆదిత్య హాస్పిటల్ ఎదురుగా ఆమె జాతీయ రహదారిని దాటుతుండగా, రాజమండ్రి నుండి వైజాగ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆమెను బలంగా ఢీకొట్టింది.​ ​ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో, లక్ష్మీకుమారి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాద సమాచారం అందుకున్న గండేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ​జాతీయ రహదారిపై రోడ్డు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular