పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు పడుతున్న అవస్థలపై ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ అనేక గ్రామాలు కనీస రవాణా సౌకర్యాలకు నోచుకోకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం మని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో నిధుల కొరతతో లేదా ఇతర సాంకేతిక కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలనీ, అటవీ అనుమతుల పేరుతో ఏళ్ల తరబడి రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకొని అనుమతులు మంజూరు చేయించాలనీ ఆయన డిమాండ్ చేశారు. కొండ కోనల్లో ఉన్న మారుమూల గ్రామాలకు కూడా పక్కా రోడ్లు నిర్మించాలనీ, వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న గ్రామాలకు తక్షణమే వంతెనలు, రోడ్లు ఏర్పాటు చేయాలనీ, గిరిజన గ్రామాల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనీ, ”రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు, రోగులను డోలీల మీద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నేటికీ కొనసాగుతోంది. అటవీ నిబంధనలు గిరిజనులజీవించే హక్కును కాలరాయకూడదునీ “ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ గ్రామాల్లో కనీస రవాణా సౌకర్యాలు నోచుకోలేదు: ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు
RELATED ARTICLES
