
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో అన్నదాత రైతన్న మీకోసం వారోత్సవాలు ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా మరియు సుభిక్షంగా ఉంటామని, రైతు సంక్షేమాన్ని పట్టని ప్రభుత్వాలు చరిత్రలో ఎంతవరకు నిలవలేదని, గత వైసిపి ప్రభుత్వం రైతు సంక్షేమ అనే పక్కన పెట్టింది కాబట్టే ఆంధ్రప్రదేశ్లో రైతులు వైసీపీని పక్కన పెట్టారని, ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేడు రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తూ, సాగు కి అవసరమైన అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని, ఎన్నికలలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ నిధులు విడతలవారీగా అందించామని, ఇప్పటికే రెండు విడతల్లో సుమారు 6, 309 కోట్లు జమ చేశారని, ఇప్పుడు మూడో వెళతా నిధులను పీఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతి రైతు ఎకౌంటుకు 6000 వేశారని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు జీవితానికి నమ్మకంగా నిలిచిందని, వారికి వ్యవసాయంలో పెట్టుబడి సాయంగా నిలుస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కర్రి సాయి కృష్ణ ,గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు , జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు ఉల్లింగల గోవింద,కాండ్రేగుల శంకర్, బొడ్డెడ వెంకట రమణ,సూరిశెట్టి రాము,మల్ల నర్సింగరావు, పేతకంశెట్టి రాజు నాయుడు,దాడి శ్రీనివాసావు,నాయుడు,దాడి శివ,సూరిశెట్టి అప్పలనాయుడు, మల్ల శేషు, దొడ్డి బుజ్జి,దొడ్డి సాంబ శివ, భేసెట్టి నాగేశ్వరావు,ఆడారి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
