పాడేరు జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పలు శాఖల్లో అవినీతి అధికారులు పెట్రేగిపోతు వారు గుట్టు చప్పుడు కాకుండా పాల్పడుతున్న అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈనేపథ్యంలోనే అక్రమార్కుల బెండు తీసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వ్యూహాత్మకంగా ప్రక్క ప్రణాళికతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏజెన్సీ రంపచోడవరంలో మును పెన్నడూ లేనంత విధంగా ప్రభుత్వ శాఖల్లో అధికారులుగా ఉద్యోగాలు చేస్తూ ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులు అడ్డుదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతూన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే రంపచోడవరం నియోజవర్గం గంగవరం.పోలీసు స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ దొరికిన సంగతి ఇంకా మరువకుండానే రాజువొమ్మంగి పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ అనే ఎస్ఐ పదిహేను వేలు రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. ఈయనతో పాటు మరో కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసారు.
మన్యంలో ఏసీబీ అధికారులు మరోసారి ప్రత్యక్షం, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకి చిక్కిన మరో ఎస్ఐ.
RELATED ARTICLES
