Thursday, April 16, 2026
HomeUncategorizedడ్వాక్రా సొమ్ము స్వాహా చేసిన యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలి: ఏపీ రైతు కూలీ సంఘం డిమాండ్

డ్వాక్రా సొమ్ము స్వాహా చేసిన యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలి: ఏపీ రైతు కూలీ సంఘం డిమాండ్

జగ్గంపేట, మార్చి 18 (జిల్లా వాణి ప్రతినిధి): రాజపూడి గ్రామంలో డ్వాక్రా సంఘం నిధులను పక్కదారి పట్టించిన యానిమేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెకు సహకరిస్తున్న వెలుగు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జగ్గంపేట వెలుగు కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన ‘కృప మహిళా శక్తి’ డ్వాక్రా సంఘం నుంచి సుమారు 7 లక్షల 75 వేల రూపాయలను యానిమేటర్ మోసపూరితంగా కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 20 నెలలుగా పొదుపు సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా పక్కదారి పట్టించినా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరాంజనేయులుఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో యానిమేటర్లు దొంగలుగా మారి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. యానిమేటర్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అమాయకురాలైన దళిత మహిళ (సంఘం ప్రెసిడెంట్)తో మల్లిషాల యూనియన్ బ్యాంక్ మేనేజర్ కాళ్లు మొక్కించడం అత్యంత దారుణమని ఆయన ధ్వజమెత్తారు. ఇది ఒక వర్గాన్ని, కులాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు, వెలుగు ఏపీఎంకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. 7.75 లక్షల రూపాయల సొమ్మును స్వాహా చేసిన యానిమేటర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమెకు వత్తాసు పలుకుతున్న ఏపీఎం (APM), సీసీ (CC) మరియు బ్యాంక్ మేనేజర్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలి.బాధిత డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలి. “సోమవారం లోగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.”— కర్నాకుల వీరాంజనేయులు, ఏపీ రైతు కూలీ సంఘం.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ (PDSU) విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కే. సతీష్, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కే. రామలింగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular