Thursday, April 16, 2026
HomeAndhra Pradeshగంజాయి రవాణా బ్యాచ్ ఆగడాలకు చెక్ పెడుతున్న జడ్డంగి ఎస్ఐ: చినబాబు

గంజాయి రవాణా బ్యాచ్ ఆగడాలకు చెక్ పెడుతున్న జడ్డంగి ఎస్ఐ: చినబాబు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి:పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి తరలిస్తున్న బ్యాచ్ గుట్టును జడ్డంగి పోలీసులు రట్టు చేశారు. స్థానిక ఎస్ఐ చిన్నబాబు తెలిపిన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎస్ఐ చినబాబుకు ముందస్తుగా వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు జడ్డంగి గ్రామ శివారులోనీ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు వ్యక్తులు రహస్యంగా గంజాయి తరలిస్తూ పోలీసులకు బట్టుపడ్డారు. ఈక్రమంలో పోలీసులకు దొరికిన వారి నుండి 70 కిలోల గంజాయి, రెండు మోటారు వాహనాలు, 900 రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో నలుగురు పురుషులు ఒక మహిళకాగా ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు ఎస్సై ధ్రువీకరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని గ్రామ రెవెన్యూ విఆర్ఓ నానాజీ మరియు మరికొందరు అధికారుల సమక్షంలో పంచనామ నిర్వహించి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చినబాబు మాట్లాడుతూ ఈజీ మనీకి అలవాటు అయ్యి అడ్డుదారిలో అడ్డంగా సంపాదించాలని జీవితాలను నాసినం చేసుకోవద్దని ఆయన మీడియా ద్వారా కోరారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకుపాలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular