నక్కపల్లి, జిల్లావాణి
యు. గురుమూర్తి బ్యాండ్, ఆర్కెస్ట్రా లో ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతూ ఇటీవల బెంగళూరు లో మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా సమక్షంలో సైతం మంచి ప్రతిభ చూపించడమే కాకుండా ఇళయరాజా తో ప్రశంసలు అందుకున్న యు. శ్రీనివాస్,శివ లను పలువురు గ్రామ పెద్దలు అభినందించారు. ఈ మేరకు కొత్త అమావాస్య పండుగ పురస్కరించుకొని నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్బంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా లో యు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి బృందం పాల్గొన్నారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వీసం రామకృష్ణ, కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు సమక్షంలో పూలమాల తో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన గురుమూర్తి వారసులు ఆంధ్ర నెంబర్ వన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా దేశంలోలోనే అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రతి ఒక్కరు హృదయాలను గెలవడం గొప్ప సంతోషం అని అన్నారు. కళాకారులను తగిన విదంగా గౌరవించి వారికి మరింతగా ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయిలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో వీసం నానాజీ,కొల్నాటి దుర్గ ప్రసాద్, కర్రి వెంకట సత్యనారాయణ,(కేవీ )కక్కిరాల సురేష్, వీసం రాజు, అల్లాడ కొండబాబు, గొడుగులు బంగ్గారాజు దేవవరపు లోవరాజు,కోసూరి శ్రీను, శ్రీపాద ప్రణవ్ రామ్,వెంకట సత్య నారాయణ, పెదిరెడ్డి రమేష్, అల్లాడ తాతారావు, ముద్దా శ్రీను, ఎల్లేటి సత్య నారాయణ,కొల్నాటి నానాజీ అడ్డూరి భూషణం, అడ్డూరి శ్రీను,లోవరాజు,ఉత్సవ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి కే వన్నె తెచ్చిన కళాకారులకు ఘన సత్కారం
RELATED ARTICLES
