పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ కి నూతనంగా మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గా లతాశ్రీ ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. ఇటీవలే సుమారు 6నెలల క్రితం ఇదే పోలీసు స్టేషన్లో శివకుమార్ అనే ఎస్ఐ ఉద్యోగ బాధ్యతల స్వీకరించి రెండు రోజుల క్రితం ఒక కేసు విషయంలో ముద్దాయిగా ఉన్న వ్యక్తీ నుండీ అక్రమంగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో చిక్కుకుని కటకటాల వెనక్కి వెళ్లడంతో ఇక్కడ రాజవొమ్మంగి స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కాలి అవ్వడంతో జిల్లా పోలీసు అధికారులు ఆదేశాల మేరకు పాడేరు మహిళా పోలీస్ విభాగంలో ఎస్.ఐ.గా పనిచేస్తున్న మహిళా ఎస్ఐ లతాశ్రీని రాజవొమ్మంగి స్టేషన్ కు ఎస్ఐగా నియమించారు. లతాశ్రీ 2018 సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ కు చెందిన వారు, ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజవొమ్మంగి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ గౌరీ శంకర్ కు మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగ రిపోర్ట్ ను తెలియజేశారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఏవిధమైన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకుపాలకు తావులేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది ఆమెకు సాదరంగా ఆహ్వానం అందించారు.
రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో విధుల్లో చేరిన మొట్ట మొదటి మహిళా సబ్ ఇన్స్పెక్టర్:లతాశ్రీ
RELATED ARTICLES
