Thursday, April 16, 2026
HomeUncategorizedరేపు పలు గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల: ఈఈ బి.వీరభద్రరావు

రేపు పలు గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల: ఈఈ బి.వీరభద్రరావు

జగ్గంపేట, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శనివారం (మార్చి 21) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) బి.వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. RDSS (Revamped Distribution Sector Scheme) పనులు మరియు నిర్వహణ మరమ్మత్తుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు. ఇర్రిపాక, మామిడాడ గ్రామాలు మరియు వాటి పరిధిలోని వ్యవసాయ బోర్లు.
మర్రిపాక గ్రామం, మర్రిపాక బోర్లు మరియు చేపల చెరువులు. నరేంద్రపట్నం మరియు రామవరం గ్రామాలకు చెందిన వ్యవసాయ బోర్లు. సబ్‌స్టేషన్ పరిధిలో..
33kv పెద్దాపురం – జగ్గంపేట ఫీడర్ నందు అత్యవసర మరమ్మత్తులు నిర్వహిస్తున్నందున, కాట్రేవులపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కాట్రేవులపల్లి,
వెంగయమ్మ పేట, సూరంపాలెం గ్రామం మరియు స్థానిక వ్యవసాయ బోర్లు. విద్యుత్ వినియోగదారులు, రైతులు మరియు ఆయా గ్రామాల ప్రజలు ఈ సమయ వ్యత్యాసాన్ని గమనించి, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular