Thursday, April 16, 2026
HomeUncategorizedరిపబ్లికన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా: పులి ప్రసాద్ నియామకం

రిపబ్లికన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా: పులి ప్రసాద్ నియామకం

గండేపల్లి, మార్చి 20( జిల్లా వాణి ప్రతినిధి):రిపబ్లికన్ ట్రేడ్ యూనియన్ (RTU) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పులి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటస్వామి, జాతీయ కార్యదర్శి కాలువగడ్డ రామచంద్ర గారు నియామక ఉత్తర్వులను జారీ చేశారు.ఈ సందర్భంగా జాతీయ నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను రక్షించడంలో ట్రేడ్ యూనియన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మెరుగైన వేతనాలు, సురక్షితమైన పని పరిస్థితులు కల్పించడమే కాకుండా, యజమానులతో సామూహిక చర్చల ద్వారా కార్మికులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చడమే తమ యూనియన్ లక్ష్యమని వారు తెలిపారు. అన్యాయమైన తొలగింపులు, వివక్ష మరియు వేధింపుల నుండి కార్మికులను కాపాడటం. పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాలను పెంచి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం. కార్మికుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం. కార్మికుల కుటుంబాలకు విద్యా, వైద్య మరియు వినోద సౌకర్యాల కల్పనకు కృషి చేయడం. కార్మిక చట్టాల ప్రకారం దక్కాల్సిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలను ఇప్పించడంతో పాటు అవగాహన కల్పించడం.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటస్వామికి, జాతీయ కార్యదర్శి కాలువగడ్డ రామచంద్రకు పులి ప్రసాద్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular