Thursday, April 16, 2026
HomeUncategorizedసత్తమ్మతల్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్

సత్తమ్మతల్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట, మార్చి 20(జిల్లా వాణి ప్రతినిధి):కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జగ్గంపేట నుండి రామవరం వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలసిన సత్తమ్మతల్లి ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా జనసేన ఇంచార్జ్ మెహర్ బాబా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. తుమ్మలపల్లి రమేష్ ముందుగా సత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని, భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం జరగాలని భక్తులు కోరుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular