పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా తరువాత అల్లూరి సీతారామరాజు పాడేరులో ఉన్న రంపచోడవరం, చింతూరు డివిజన్లు పోలవరం డివిజన్లను ఒకటిగా కలిపి ప్రజా అవసరాలకు అనుగుణంగా రంపచోడవరం ప్రధాన కేంద్రంగా ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాకు కొత్త కలెక్టర్ గా కె దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం 2017 బ్యాచ్ కి చెందిన దినేష్ కుమార్ ను కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దినేష్ కుమార్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు పలు కీలక పదవులు నిర్వహించిన దినేష్ కుమార్ కు నూతనంగా ఏర్పడిన జిల్లాకు అధికారిక కలెక్టర్ నియమించడం పట్ల జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నూతన పోలవరం జిల్లాకు కలెక్టర్ గా దినేష్ కుమార్ నియామకం
RELATED ARTICLES
