కార్మిక ,రైతు సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని హరిపాలెం, తిమ్మరాజుపేట, మడుతురు గ్రామాల్లో బ్రాండ్ ఎక్స్, ఫార్మా, ఉపాధి హామీ ఇతర కార్మికుల ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతులు పై కక్ష కట్టి రైతులకు కార్మికులకు నష్టదాయకమైన రైతు నల్ల చట్టాలు, లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది దీనివలన కష్టపడి పనిచేసే కార్మికులు, రైతులు, ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతారు ఉన్న చట్టాలను తీసేసి కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా మార్చుతున్నారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో శ్రమ చేసే శ్రామికులందరూ పాల్గొని మన యొక్క నిరసనను తెలియజేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము ,కౌలు రైతు సంఘం నాయకులు కే రామ సదాశివరావు,జె వి వి నాయకులు బొడ్డేడ రామ్ కుమార్, సిఐటియు మండల కన్వీనర్ కే సోమనాయుడు, ఉపాధి కూలీలు నడుపురి సన్యాసిరావు, ఎస్ కన్మనాయుడు ,తదితరులు పాల్గొన్నారు.

