అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం పంచాయతీ పరిధిలోని పాపంపేట గ్రామంలో ప్రభుత్వ రీ-సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో రైతుల భూముల సరిహద్దులను పునర్నిర్ధారించేందుకు అధికారులు ఆధునిక సాంకేతిక పరికరాలతో స్థల పరిశీలనలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా తాసిల్దార్ నాగమ్మ పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు ప్రత్యక్షంగా పొలాల్లోకి వెళ్లి భూములను కొలుస్తూ సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల సమక్షంలోనే కొలతలు తీసుకుంటుండడంతో ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది.పాత రికార్డుల్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దడం, భూ వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా భూముల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, స్థానికంగా కూడా భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే పనులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సీతారామ్ సర్వేయర్ ఎస్.కె అమనుల్లా మరియు సర్వే సిబ్బంది వీఆర్ఏ నూకరత్నం పాల్గొన్నారు.
పాపంపేటలో భూసరిహద్దుల పునర్నిర్ణయం.
RELATED ARTICLES
