Thursday, April 16, 2026
HomeAndhra Pradeshపోసిన అప్పనబాబు నేతృత్వంలో ఘనంగా గోటి తలంబ్రాల కార్యక్రమం

పోసిన అప్పనబాబు నేతృత్వంలో ఘనంగా గోటి తలంబ్రాల కార్యక్రమం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: మార్చి నెల 26 నుండి జరిగనున్న శ్రీరామనవమి మహోత్సవాలు సందర్భంగా అమీనాబాద్ పంచాయితీలోని ఏ.బి కాలనీ గ్రామంలో స్థానిక మహిళ భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. వాటిని స్థానిక గ్రామంలోని రామాలయంలో భద్రాపర్చారు. ఉదయాన్నే స్నానం చేసి రామాలయంలో పూజలను చేసి ఆరు కిలోలు వరి దాన్యాన్ని చేతి గోళ్ళతో ఒలిచి, బియ్యాన్ని సిద్ధం చేశారు. ప్రతీ రోజూ గోటి తలంబ్రాలను ఒక పాత్రలో ఉంచి సీతారాముల విగ్రహాలు వద్ద ఉంచి పూజలను చేశారు. రామ నామస్మరణతో గోటి తలంబ్రాలు వలిచే కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో పూర్తి అయ్యిందని ఆలయ కమిటీ తెలిపారు. రామాలయంలోని రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈకార్యక్రమం ముఖ్యభూమికగా పోసిన అప్పనబాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular