పోలవరం జిల్లావాణి ప్రతినిధి : పూర్వకాలం పేద బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పోరాట యోధులను గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయపు సమావేశపు హాలులో శెట్టిబలిజ జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు అలుపెరగని పోరాటయోధుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, ఏపీవో జనరల్ డి ఎన్ వి రమణ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, పశు సమర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షరీఫ్, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ. శ్రీనివాసరావు దొమ్మేటి వెంకటరెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ మాట్లాడుతూ కీర్తిశేషులు దొమ్మేటి వెంకట్ రెడ్డి వారి 173 జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి వారు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బోడస కుర్రు గ్రామంలో 1853వ సంవత్సరం మార్చి 23వ జన్మించారని అదేవిధంగా 1928 ఇదే గ్రామంలో కాలం చేశారని ఆయన అన్నారు. కీర్తిశేషులు దొమ్మేటి వెంకట్ రెడ్డి గారు 18వ శతాబ్దానికి చెందిన వారిని ఆయన అన్నారు. శెట్టిబలిజలను సంఘటితం చేసి వారి హక్కుల కోసం అదేవిధంగా శెట్టిబలిజలా విద్యాఅభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా శెట్టిబలిజ అభ్యున్నతికి పాటుపడిన కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి వారి జయంతిని అధికారికంగా పండగలగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడి శ్రీనివాస్ విశ్వనాథం,ఏ డి ఏ లు కే .రామ్మోహన్రావు, కే సావిత్రి, డిఎం అండ్ హెచ్ ఓ పి సరిత,డి ఎల్ పి ఓ రామకృష్ణ, ఏ ఎస్ ఓ విజయ భాస్కర్, సిడిపిఓ కే ఉమా, జిసిసి డిఎం జయశ్రీ, తాసిల్దారులు పి. బాలాజీ, సిహెచ్. శ్రీనివాసరావు, వేణుగోపాల్,అమ్మాజీ, దొరకయ్య,కే. సత్యనారాయణ, ఎంపీడీవోలు కుమార్, లక్ష్మణ్,బాపన్న దొర, జయంతి,ఎస్. శ్రీనివాసరావు,శేషగిరి, ఐటీడీఏ పరిపాలన అధికారి యర్రం శెట్టి రాజు,జిల్లా హార్టికల్చర్ అధికారి దేవాదానం, పీహెచ్ఓ ముత్తయ్య, ఎస్ ఓ టి. మార్తమ్మ, డిప్యూటీ తాసిల్దారులు రవీంద్రబాబు, సరిత, స్వామి, శ్రీధర్, త్రిమూర్తులు, పీఎంయు అధికారులు చంద్రకళ, సంధ్య,వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు
RELATED ARTICLES
