Thursday, April 16, 2026
HomeUncategorizedవిశాఖ దక్షిణ నియోజకవర్గంలో పూర్టైన వైస్సార్ సిపి నూతన కమిటీలు

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పూర్టైన వైస్సార్ సిపి నూతన కమిటీలు

నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్సిపి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు వీసం రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు 33వ వార్డుకు సంబందించిన ఆరు సచివాలయాల పరిధిలో పార్టీ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తో వీసం పాల్గొన్నారు.అనంతరం కమిటీ సభ్యులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వీసం మాట్లాడుతూ పార్టీ కి పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరు అహర్నిశలు కష్టపడి పనిచేయాలని రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పార్టీ లో సముచిత స్థానం ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్య మంత్రి ని చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ కి చెందిన వాడపర్తి కనక రత్నం వైస్సార్ సిపి లో చేరారు. కనక రత్నంకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular