Sunday, April 19, 2026
HomeUncategorizedగ్రామ భద్రత దృష్ట్యా సిసి కెమెరాలు ఏర్పాటు

గ్రామ భద్రత దృష్ట్యా సిసి కెమెరాలు ఏర్పాటు

నక్కపల్లి,జిల్లావాణి

మండలంలో కాగిత గ్రామంలో భద్రత ద్రుష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు గ్రామ సర్పంచ్ పోతంశెట్టి రాజేష్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకొని కాగిత గ్రామం ఉండడం తో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు,జరగకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించానన్నారు. గ్రామానికి ప్రధాన కూడలిలో జాతీయ రహదారిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద, ఎస్సీ కాలనీ రోడ్డు, రాజీవ్ పల్లెబాట రోడ్డు లో సూర్యనారాయణమూర్తి గుడి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గతంలో పలుమార్లు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో చోరీలు జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారితో పాటు స్టీల్ ప్లాంట్ రోడ్ లో నిత్యం పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున గ్రామ భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేష్ ను గ్రామస్తులు పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular