Thursday, April 16, 2026
HomeUncategorizedరోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: జగ్గంపేటలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: జగ్గంపేటలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

జగ్గంపేట, మార్చి 24(జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జగ్గంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్-చార్జ్ SDPO KVV సత్యనారాయణ సూచనలతో, జగ్గంపేట సీఐ B. తిరుపతి, ఎస్ఐ T. రఘునాథరావు డ్రైవర్లకు పలు కీలక సూచనలు చేశారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే (NH 16), స్టేట్ హైవే రోడ్లపై ప్రమాదాలను అరికట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.పోలీసుల కీలక సూచనలు:లైసెన్స్ తప్పనిసరి: ఆటో నడిపే ప్రతి డ్రైవర్ ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మద్యం సేవించి వాహనం నడపరాదు: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులు వద్దు: ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ప్రమాదకరం.క్రమశిక్షణతో కూడిన రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు, వ్యాపారస్తులకు మరియు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలి.రికార్డులు సక్రమంగా ఉండాలి. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular