పోలవరం జిల్లావాణి ప్రతినిధి: డిసిసిబి కేంద్ర సహకార బ్యాంకుల నుండి వ్యవసాయనికి క్రాప్ లోన్ రుణాలు మంజూరు చేస్తున్నట్లే పిఎసిఎస్ బంగారు నగల రుణ సదుపాయం కల్పించాలని రాజవొమ్మంగి మండల సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్ కాకినాడలో సోమవారం జరిగిన డిసిసిబి సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఛైర్పర్సన్ తుమ్మల రామస్వామి బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా ముప్పన కేశవ్ మాట్లాడుతూ రైతుల వ్యవసాయ పంటలకు నూతనంగా గోల్డ్ లోన్ ద్వారా పంట రుణాలు మంజూరు చేస్తే, బయట ప్రైవేట్ కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల జోలికి రైతులు వెళ్లకుండా స్థానికంగా ఉన్న సొసైటీలలోనే బంగారంపై వ్యవసాయానికి రుణాలు పొందేందుకు వీలుగా ఉంటుందని ఆయన చూపించారు. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఛైర్పర్సన్ రామస్వామి బాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సహకార సంఘాల సొసైటీ బ్యాంక్ లద్వారా బంగారంపై ఋణాలు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు రాజవొమ్మంగి మండల సొసైటీ అధ్యక్షులు ముప్పన కేశవ్ మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లాకు చెందిన పలు మండలాలకు చెందిన సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
రైతులకు సొసైటీ బ్యాంక్ లద్వారా బంగారంపై ఋణాలు అందజేయాలి రాజవొమ్మంగి సొసైటీ చైర్మన్: ముప్పన
RELATED ARTICLES
