Thursday, April 16, 2026
HomeUncategorizedజగ్గంపేటలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

జగ్గంపేటలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

జగ్గంపేట, మార్చి 27(జిల్లా వాణి ప్రతినిధి కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక అభిమానులు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య తుమ్మలపల్లి రమేష్ భారీ కేక్‌ను కట్ చేసి, రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదారపు వీరబాబు, తుల్లా శ్రీను, కురుమల్ల నాగేశ్వరావు, గంధం ప్రభాకర్, కాయల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసైనికులు, మెగా అభిమానులు నినాదాలతో జగ్గంపేట పట్టణాన్ని హోరెత్తించారు.”రామ్ చరణ్ తన అద్భుత నటనతో తెలుగు సినీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఆయన మనందరికీ గర్వకారణం. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.” తుమ్మలపల్లి రమేష్, జనసేన ఇంచార్జ్ ఈ కార్యక్రమంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular