Thursday, April 16, 2026
HomeUncategorizedతెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమే కొండంత శక్తి --హోం మంత్రి అనిత --

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమే కొండంత శక్తి –హోం మంత్రి అనిత —

నక్కపల్లి, జిల్లావాణి

మండలం లో బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవం గా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి , ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.అనంతరం ఆమె కార్యకర్తల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
నాయకులు,కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ మేరకు పార్టీ పుట్టిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ ఎనలేని సేవలందించిన సీనియర్ కార్యకర్తలను హోం మంత్రి సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే ముఖ్యమని ,కార్యకర్తలు బలంగా ఉంటే, ఆ పార్టీ బలంగా ఉంటుందన్నారు.
44 సంవత్సరాలు పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతుందంటే కార్యకర్తలే కారణం అని కార్యకర్తలను కొనియాడారు.
యుగపురుషుడు ఎన్టీ రామారావు.రాజకీయాల్లోకి రావడం తెలుగు ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని గుర్తు చేశారు.ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారని తెలియజేసారు.ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకి ఇచ్చినది ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు.మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది కూడా ఎన్టీఆర్ అని అన్నారు.
గత పాలనలో టిడిపి కార్యకర్తలు ఎక్కడ భయపడలేదన్నారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాటం చేశారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. ఎన్. డి.ఏ కూటమి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ఈ సందర్బంగా ప్రారంభోత్సవం చేశారు.అనంతరం కార్యకర్తలు తో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమం లో పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ , మండల పార్టీ అధ్యక్షులు గింజాల లక్ష్మణ రావు, పాయకరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవర సత్య నారాయణ, నక్కపల్లి పిఏసిఎస్ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి,బోది గల్లం సర్పంచ్ షేక్ మున్నిష,సీనియర్ నాయకులు కురం దాసు నూకరాజు, యజ్జర్ల వినోద్ రాజ్, ఐ టిడిపి సభ్యులు రమేష్, నల్లల నరేష్, పాయకరావుపేట నియోజకవర్గం నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular