Thursday, April 16, 2026
HomeAndhra Pradeshజాతీయ రహదారి 516పై కొనసాగుతున్న రోడ్డు ప్రమాదాలు మరో వ్యక్తి దుర్మరణం

జాతీయ రహదారి 516పై కొనసాగుతున్న రోడ్డు ప్రమాదాలు మరో వ్యక్తి దుర్మరణం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే రంపచోడవరం డివిజన్ పరిధిలోని రా జవొమ్మంగి మండలం జడ్డంగి నుండి అడ్డతీగల వైపు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న పోతంశెట్టి మురళీమోహన్ రెడ్డి రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన గేదెలను ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. శనివారం రాత్రి 8:30 సమయంలో జడ్డంగి గ్రామం నుండి అడ్డతీగల వైపు బయలుదేరిన మురళీమోహ న్ రెడ్డి, చెరుకుంపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 516పై వెళ్తుండగా గేదెలు రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అంతర్ బంగాలనుండి అధిక మోతాదులో రక్తస్రావం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మురళీమోహన్ రెడ్డిని వెంటనే అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితి చెయ్యి పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తీ రాజవొమ్మంగి మండలంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న అమ్మిరాజు భర్తగా గుర్తించారు. రోడ్డు ప్రమాదం తీరుతో మురళీమోహన్ రెడ్డికి చెందిన కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషులు స్థానిక ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular