Friday, June 5, 2026
HomeAndhra Pradeshవేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు కేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీఓ లోకుల

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు కేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీఓ లోకుల

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలంలోని ప్రధాన కూడళ్ళ సమీప ప్రాంతాల్లోని జనతాకిడి ఉన్న ప్రతి చోట ముఖ్యంగా జాతీయ రహదారికి అనుకోని ఉన్న అన్ని బస్ రిక్వెస్ట్ స్టాప్ ల వద్ద మంచినీరు సదుపాయాన్ని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నమని రాజవొమ్మంగి మండల ప్రజా పరిషత్ ఉన్నత అధికారి (ఎంపీడీఓ) లోకుల యాదగిరీశ్వరరావు శనివారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు చలి వేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular