Thursday, April 16, 2026
HomeUncategorizedశరభవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

శరభవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

దశాబ్దాలు దాటిన రాజకీయ యుద్ధయానం – కార్యకర్తల్లో మళ్లీ హై వోల్టేజ్ ఉత్సాహం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరంలో తేదేపా పార్టీ మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రమంతా తీవ్ర వేడి రాజకీయ సందేశాలతో జరిగింది. ఉద్యమ పార్టీగా జన్మించిన టిడిపి, నాలుగు దశాబ్దాల తర్వాత కూడా రాజకీయ రంగంలో తన పోరాట సత్తా తగ్గలేదని ఈ కార్యక్రమాలు మరోసారి స్పష్టంగా చూపించాయి.
నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి కార్యాలయాల వద్ద చేరి జెండా ఆవిష్కరణ చేసి, ఎన్టీఆర్ సిద్ధాంతాలనూ, పార్టీ పోరాట చరిత్రనూ ఘాటుగా ప్రజల్లో వినిపించారు. ముఖ్యంగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ తిరిగి ప్రజల్లో గట్టి స్థానం సంపాదించాల్సిన అవసరాన్ని నేతలు బహిరంగంగా స్పష్టం చేశారు.చట్ట సభల్లో అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సమస్యలపై టిడిపి స్టైల్‌లో మళ్లీ దాడి ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని నేతలు వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయిలో పార్టీని రీ-కాన్‌ఫిగర్ చేయడం, యువతను ఆకర్షించడం, సభ్యత్వాన్ని దూకుడుగా విస్తరించడం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిరేశాలు జారీ అయ్యాయి.44 ఏళ్ల పార్టీ, ఇంకా రాజకీయ రంగం నుండి తప్పుకోలేదని ఇప్పటికీ తానే గేమ్ చెంజర్ అని ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాడ చంద్రతో పాటు తెదేపా శ్రేణులు పెద్దలు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular