మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దని అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు నాయకులు కే ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రైవేటుపరం ప్రయత్నిస్తుందని ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా నాలుగు వేల మంది మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే ఈ 4000 మంది పరిస్థితి ఏంటి అని నిడదీశారు. ఈ పథకాన్ని ప్రైవేటుపరం చేయడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు 10000 ఇవ్వాలని ఐడి కార్డులు ఇవ్వాలని యూనిఫారం భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి మధ్యాహ్నం భోజనం సంగం నాయకులు అమ్మాజీ, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ, పాల్గొన్నారు.
మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు సిఐటియు.
RELATED ARTICLES
