Thursday, April 16, 2026
HomeUncategorizedక్రైస్ట్ చర్చ్ జగ్గంపేటలో ప్రథమ వార్షికోత్సవం: వాక్య సత్యంతోనే ఆత్మీయ ఎదుగుదల

క్రైస్ట్ చర్చ్ జగ్గంపేటలో ప్రథమ వార్షికోత్సవం: వాక్య సత్యంతోనే ఆత్మీయ ఎదుగుదల

జగ్గంపేట, మార్చి 30(జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట స్టార్లింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దభక్తుల స్తుతి ఆరాధనలు, దైవ వాక్యోపదేశాల మధ్య జగ్గంపేట పరిసర ప్రాంతంలో క్రెస్ట్ చర్చ్ జగ్గంపేట ప్రథమ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బ్రదర్ కె. అభి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది విశ్వాసులు, సహోదరులు పాల్గొని దైవ కృపను చాటిచెప్పారు. అంతరంగంలో సత్యం – దేవుని కోరిక ఈ సందర్భంగా బ్రదర్ కె. అభి ముఖ్య సందేశాన్ని ఇస్తూ, దేవుడు మనిషి యొక్క బాహ్య రూపాన్ని కంటే అంతరంగంలోని యథార్థతను, సత్యాన్ని కోరుకుంటారని ఉద్ఘాటించారు. కీర్తనల గ్రంథం 51:6 మరియు 15:2-4 వచనాలను ఉదహరిస్తూ, “యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరిస్తూ, హృదయపూర్వకముగా నిజం పలికేవారే దేవునికి ఇష్టులు” అని వివరించారు. మన మాట తీరులో, ప్రవర్తనలో క్రీస్తును ప్రతిబింబించాలని ఆయన పిలుపునిచ్చారు.సేవలో సహనం.. కష్టానికి ప్రతిఫలం దేవుని పనిలో ఎదురయ్యే కష్టాలను, అవమానాలను భరిస్తూ సాగిపోవాలని, మనుషుల మెప్పు కంటే దేవుని గుర్తింపు ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. “మీ కష్టాన్ని, ప్రయాసను లోకం గుర్తించకపోయినా, దేవుడు చూస్తున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం శాశ్వతమైనది” అని చెబుతూ సేవలో ఉన్నవారిని, సహకరించిన వారిని ప్రోత్సహించారు. విశేష జాగ్రత్త అవసరంనేటి కాలంలో వాక్యం వినడానికి కరువు లేదని, కానీ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడంలోనే అసలైన సవాలు ఉందని అభి గుర్తుచేశారు. దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా అందించబడిన దేవుని మాటలు నేడు గ్రంథస్థం చేయబడి మన చేతుల్లో ఉన్నాయని, ఇంతటి గొప్ప వాక్యం పట్ల మనం విశేష జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించారు. కూడికకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని, వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ జీవితంలో కక్షలు, కార్పణ్యాలకు తావుండకూడదని, అందరినీ ప్రేమించి క్షమించే గొప్ప మనసు కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లాలని, అనేక ఆత్మలను రక్షించడానికి సిద్ధపడాలని ప్రణాళికలు ప్రకటించారు. చివరగా, ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి, అందరికీ శుభీవాదాలు తెలియజేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ ఆవిర్భావ వేడుకలు స్థానిక విశ్వాసులలో నూతన ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక బలమును నింపాయి ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular