అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ములకలాపల్లి గ్రామం నందు గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) 55 వ భద్రతా వారోత్సవాలు

అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ములకలాపల్లి గ్రామం నందు గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) నందు తేది 04.03.2026 నుండి తేది 10.03..2026 వరకు జరుపుకున్న 55 వ భద్రతా వారోత్సవాలు ముంగింపు సందర్బంగా ముగింపు సభకు గౌరవనీయులు జాయింట్ చీఫ్ ఇనస్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ జె.శివ శంకర్ రెడ్డి గౌరవ అతిధిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీకి స్కోడాప్ హానర్ అవార్డు రావడం అభినందనీయం అని తెలిపారు. పనిలో నోస్ మాస్క్ హెల్మెట్ సేఫ్టీ జాకెట్ తప్పని సరిగా దరించి పనిచేయాలని తెలియజేసారు, ఎత్తు ప్రదేశాలలో సేఫ్టీ పరికరాలు తప్పని సరిగా వేసుకొనే పనిచేయాలని సూచించారు, అందరూ భద్రతతో పనిచేయాలని సూచించారు, ఈ భద్రతా వారోత్సవాలు సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ క్విజ్ కాంపిటేషను నందు పాల్గొన్న ఉద్యోగులు మరియు కార్మికులకు బహుమతులు ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమములోజాయింట్ చీఫ్ ఇనస్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ జె.శివ శంకర్ రెడ్డి, ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి.రామస్వామి సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) శ్రీ ఎల్ శ్రీనివాసరావు మేనేజర్ సేఫ్టీ శ్రీ కె. సతీష్ రెడ్డి , హెచ్. ఓ. డి లు, ఇతర ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.
