అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొండపాలెం, కంచుగుమ్మల,శరభవరం, అడ్డసారం,పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు మరియు వివిధ ప్రాజెక్టు పనులకు చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు ఘనంగా శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేతో పాటు రోలుగుంట మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర, సర్పంచ్ చిరంజీవి, సీనియర్ నాయకులు మౌళి, ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, కంచుగుమ్మల సర్పంచ్ బండారు శ్రీను, పి ఎ సి ఎస్ అధ్యక్షుడు సుర్ల బాబులు,లగుడు సత్తిబాబు సబ్బవరపు పెద్ది నాయుడు నాయకులు పార్టీ శ్రేణులు అలాగే ఇతర మండల నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, “గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ప్రాథమిక అవసరాలైన రోడ్లు, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కొండపాలెంలో చేపట్టిన ఈ పనులను అత్యంత వేగంగా, నాణ్యతతో పూర్తి చేస్తాం,” అని స్పష్టం చేశారు. దీనికి స్పందించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న సిమెంట్ రోడ్లు, నీటి సౌకర్యాల పనులు ప్రారంభం కావడంతో కొండపాలెం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నందుకు ఎమ్మెల్యేకు మరియు స్థానిక నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ శ్రేణులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్మాదే మా ధ్యేయం ఎమ్మెల్యే కే ఎస్ ఎంఎస్ రాజు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
RELATED ARTICLES
