ప్రజా సమస్యల పరిష్కారాని కై ఏప్రిల్ 2 అనకాపల్లి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పూడిమడక గ్రామ మత్స్యకారులు పాల్గొని జయప్రదం చేయాలని పూడి మడక గ్రామంలో సిపిఎం పర్యటించడం జరిగింది .ఈ సందర్భంగా సిపిఎం పూడిమడక శాఖ కార్యదర్శి చేపల తాతయ్య మాట్లాడుతూ గ్రామంలో కొత్త పడవలకు రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు చుట్టూ తిరుగుతున్న బోటు రిజిస్ట్రేషన్ చేయడం లేదని దీనివలన వేట నిషేధ కాలంలో ఈ ఏడాది మత్యకారులకు మత్స్యకార భరోసా నష్టపోతారని వెంటనే బోట్లు రిజిస్ట్రేషన్ చేయాలని, జెట్టి నిర్మాణం చేపట్టాలని, ఏపీఐఐసీ పెండింగ్ ప్యాకేజీ లు లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వాలని, కాలుష్యం వలన సముద్రంలోకి పరిశ్రమ వ్యర్ధాలు కలవడం వలన మత్స్య సంపద తగ్గిపోయి చేపలు చనిపోతున్నాయని దీంతో ఉపాధి లేక మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక పరిశ్రమలలో పూడిమడక యువత, ప్రజలకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అర్హులైన మత్స్యకారులకు పింఛన్లు ,రేషన్ కార్డులు ఇవ్వాలని ,గ్రామంలో వీధిలైట్లు వెలగక రాత్రులు వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వీధిలైట్లు వేయాలని, మత్స్యకారులకు సబ్సిడీపై ఇంజన్లు ,వలలు, గంపలు, ఐస్ బాక్సులు పంపిణీ చేయాలని, ఇంటింటా కొళాయిలను వేసిన నీరు సక్రమంగా సరఫరా సక్రమంగా రాక మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారని పై సమస్యలు పరిష్కారానికి వచ్చే నెల రెండో తారీఖున జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో మత్స్యకారులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కన్వీనర్ ఆర్ రాము, మండల కమిటీ సభ్యులు కే సోమనాయుడు, మత్స్యకారులు గంగేరి అప్పలరాజు, గనగల అమ్మోరయ్య, కనగాల అప్పన్న ,నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

